Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

Punjab Kings lost against Mumbai Indians in IPL 2024
Advertisement
  • 9 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్
  • అద్భుతంగా పోరాడిన పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ.. అయినా తప్పని ఓటమి
  • తలో మూడు వికెట్లు తీసిన ముంబై బౌలర్లు కోయిట్జి, బుమ్రా, మధ్వల్
  • బ్యాటింగ్‌లో 78 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్
Advertisement
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చంఢీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం ముంబైని వరించింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్ శర్మ తన జట్టు గెలుపు ముంగిటకు తీసుకొచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు బాదాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరిలో అతడు ఔట్ కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కోయిట్జి, బుమ్రా, ఆకాశ్ మధ్వల్ తలో మూడు వికెట్లు తీయగా.. ఒక వికెట్ రనౌట్ రూపంలో లభించింది.

పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్ (6), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (0), రూసో (1), లియామ్ లివింగ్‌స్టోన్ (1), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (13), శంకర్ సింగ్ (41), జితేశ్ శర్మ (9), ఆశుతోశ్ శర్మ (61), హర్‌ప్రీత్ బ్రార్ (19), కగిసో రబాడ (8) అర్షదీప్ సింగ్ (1) చొప్పున పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై భారీ స్కోర్ సాధించడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 78 పరుగులు బాది టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34 నాటౌట్), టిమ్ డేవిడ్ (14), హార్ధిక్ పాండ్యా (10), ఇషాన్ కిషన్ (8), షెఫర్డ్ (1), నబీ (0) చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రాన్ 2, రబాడ 1 చొప్పున వికెట్లు తీశారు.
Advertisement
Advertisement
IPL 2024
Mumbai Inidians
Punjab Kings
Cricket

More Telugu News